అధ్యాత్మ సంకీర్తన
రేకు: 271-6
సంపుటము: 3-411
రేకు: 271-6
సంపుటము: 3-411
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| ఇంతటి దైవము లేఁడు యెందుఁ జెప్పి చూపఁగ వంతులకుఁ గొలిచేటివారి భాగ్య మిఁకను | ॥పల్లవి॥ |
| గక్కన మన్మథునిఁ గన్నతండ్రి గనక యెక్కువ చక్కఁదనాల కితఁడే దొడ్డ నిక్కపు సూర్యచంద్రాగ్నినేత్రుఁడు గనక దిక్కులఁ గాంతుల నీ దేవుఁడే దొడ్డ | ॥ఇంత॥ |
| అంచెల లక్ష్మికి మగఁడై నాఁడు గనక యెంచ రాని సంపదల కితఁడే దొడ్డ పంచినచోటఁ జక్రము పంపు చేసీఁ గనక మించిన ప్రతాపాన మిక్కిలిని దొడ్డ | ॥ఇంత॥ |
| దైవికపుఁ బురుషోత్తముఁ డితఁడు గనక దేవతల కెల్లా నీ దేవుఁడే దొడ్డ వావాత శ్రీవేంకటాద్రి వరములిచ్చీఁ గనక యేవల దాతలలోన నితఁడే దొడ్డ | ॥ఇంత॥ |


