Display:
శృంగార సంకీర్తన
రేకు: 1921-1
సంపుటము: 29-61
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రీతిగౌళ
సిగ్గులు వడఁగనేల సెలవి నవ్వఁగనేల
వొగ్గి విడె మందుకోవే వుబ్బుతోడను
॥పల్లవి॥
వాడికగల సతికి వలపు లాడేరును
వేడుకలో పెంచితే వెలయుఁ దమి
కేడఁగూడఁ గోరికలు కొనలుసాగు
చూడవే విభువి దిక్కు సూటితోను
॥సిగ్గు॥
పెనఁగులాడఁగానే ప్రేమములు నిండుకొను
చెనకగానే రతి చిమ్మిరేఁగును
చనవునఁ గొసరితే చవివుట్టు సరసము
మనసిచ్చి యితనితో మంతనము లాడవే
॥సిగ్గు॥
యెడయక వద్దనుంటే యెక్కుడౌఁ జుట్టరికము
జడిగొన్నకాఁగిళ్ళు సతముసేసు
అడరి శ్రీవేంకటేశుఁ డంతలోనే నిన్నుఁ గూడె
కడఁగి మోవి చూపవే కందువ లీడేరును
॥సిగ్గు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము