Display:
శృంగార సంకీర్తన
రేకు: 1921-3
సంపుటము: 29-63
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
ఎటువంటి నేరుపరి యెంతటి జాణ
తటుకన నీ గుణాలే తడవీ నే పొద్దును
॥పల్లవి॥
కసుఁగందని మాఁటలఁ గడు సరస మాడుతా
ముసి ముసి నవ్వులతో మురిసీఁ జెలి
వసివాడని చేఁతల వలపులు చల్లుకొంటా
కొసరుచు ముద్దులు గునిసీ నీయెదుట
॥ఎటు॥
వులివచ్చి తమకాన నుమ్మగిలుకొంటాను
వములువాఁడి చూపుల మురిసీ నాపె
గిలుకు మట్టెల మోఁత కెరలించుకొంటాను
పిలిచి తా రతులకుఁ బెనఁగీ నీ యెదుట
॥ఎటు॥
నినుపు నివ్వెరగుల నీట్టు చూపుకొంటాను
మునిముంగిట సిగ్గుల మురిసీఁ దాను
యెనసితివి శ్రీవేంకటేశ నన్ను నింతలోనె
వినయాన మాతోనే వెలసీ నీయెదుట
॥ఎటు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము