Display:
శృంగార సంకీర్తన
రేకు: 1921-5
సంపుటము: 29-65
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
ఆ సరి(గిం?)చి నాఁటదాని నలఇంచరా దందురు
సేసిన నా విన్నపాలు చిత్తగించు మిఁకను
॥పల్లవి॥
కచ్చుపెట్టి యాపె నీకుఁ గాచుకవుండఁగానే
వచ్చితి విప్పుడు నావద్దికి నీవు
ముచ్చటతో నప్పటి నీమోము చూడఁగానే
మచ్చికసేసి నాతో మాఁటలాడేవు
॥ఆస॥
కూరిమితో నాపె నీకొంగు వట్టుకుండఁగానే
చేరి నాతో నవ్వేవు సెలవులను
సారె సారె నీ యెదుట సన్నలు సేయఁగానే
గారాన నన్ను నిట్టె కాఁగిలించేవు
॥ఆస॥
చేతులారా నాపె నీపై సేసలు చల్లఁగానే
యేతుల సరసమాడే విప్పుడు నాతో
కాతరాన శ్రీవేంకటేశ న న్నేలితివి
నీతో నాపెఁ గూడఁగానే నీ మోవి నా కిచ్చేవు
॥ఆస॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము