Display:
శృంగార సంకీర్తన
రేకు: 1922-5
సంపుటము: 29-71
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గౌళ
తలఁచిన తలఁపులు తలకూడెను
కలకాలమును మీకు కాఁపుర మీడేరెను
॥పల్లవి॥
ఇంతి, నీవు వచ్చేవంటా నెదురుచూచె నిందాఁకా
చెంత సగినా లడిగె జలరేఁగి
సంతోసాన నీ గుణాలె సారె బొగడె మాతోను
వింతలేక యింతలోనె విచ్చేసితి వీడకు
॥తలఁ॥
కన్నులు మూసి తెరచి కలలుగనె లోలోనె
నిన్నుఁ బిలువ చెలితో సన్నలుసేసె
వన్నెగా లేకలు వాసె వడి నీకుఁ గొంతవడి
యెన్నికగా విచ్చేసితి వింతలో నిక్కడికి
॥తలఁ॥
వేడుకతో మదనుని వేఁడుకొనె నీ రాకకు
కూడే తలపోఁతలే కోరుకుండెను
తోడనె శ్రీవేంకటేశ తొల్లె తెరలో నేలి
యీడుజోడై విచ్చేసితి వీకె యింటిలోనికి
॥తలఁ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము