శృంగార సంకీర్తన
రేకు: 1925-2
సంపుటము: 29-86
రేకు: 1925-2
సంపుటము: 29-86
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| ఇందుకుఁగా నెగ్గు దప్పు లెంచకువయ్యా సందడించీ నా మోహము జంటలై యీరీతిని | ॥పల్లవి॥ |
| విన్నవించే నా మాటలు వినయ మెంత చూపినా కన్నులచూపులై నిన్నుఁ గాఁడి పారీని పన్నుక నా నుదురు నీ పాదాలకు మొక్కినాను నిన్ను నా చక్కఁదనము నివ్వెరగందించీని | ॥ఇందు॥ |
| సారె నా చేతులు నీతో సరసము లాడినాను వారక నాగోళ్ళు నీపై వాఁడిమీరీని నేరుపుతో నా సెలవి నీతో నెంత నవ్వినాను కూరిమి నా పెదవులు కొసరింపిచీని | ॥ఇందు॥ |
| పుడమి నా కాఁగిలి నీ పొందు లెంత సేసినాను వడిఁ జన్నులు కొండలవలె నొత్తీని యెడయక శ్రీవేంకటేశ నీ దేవులనైతి వుడివోనిరతులు నిన్నుబ్బురేఁచీని | ॥ఇందు॥ |


