శృంగార సంకీర్తన
రేకు: 1925-4
సంపుటము: 29-88
రేకు: 1925-4
సంపుటము: 29-88
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
| సుదతి చందము నీవే చూడవయ్యా అదివో యిద్దరూ మాఁటలాడుకోరయ్యా | ॥పల్లవి॥ |
| తలపోయుఁ గొంతవడి తరుణి నీ గుణములు చెలఁగి తమకమునఁ జెమరించును పలుమారు నీమీఁది పదములు వాడుకొని అలరి యాపె సుద్దు లెంతడిగేవయ్యా | ॥సుద॥ |
| పనివూని నీ సుద్దులు పడఁతులతోఁ జెప్పును ననుపు నీ చేఁతలకు నవ్వు లోలోనె వొనరఁ బానుపుమీఁద నుండి నీ కేదురుచూచు యెనయఁగ నాపె కత లిటువంటియ్యా | ॥సుద॥ |
| నీ రతులు భావించి నెమ్మిఁ జిత్తము గరఁగు కోరికలు నీపైఁ బెట్టి గుబ్బతిలును చేరి యింతలో నీకెను శ్రీవేంకటేశ కూడితి - వీ రీతిరి నీ దేవులు యెరుఁగుకోవయ్యా | ॥సుద॥ |


