శృంగార సంకీర్తన
రేకు: 1925-5
సంపుటము: 29-89
రేకు: 1925-5
సంపుటము: 29-89
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
| ఇంతట మెచ్చఁగదవే ఇద్దరూ మీరు మంతనానఁ గూడితిరి మచ్చిక దైవారను | ॥పల్లవి॥ |
| తరుణి నామాట నీకు తారుకాణ వచ్చెనా సిరుల నీఇంటికి విచ్చేసె నితఁడు సరుగ నీమనసుకు సంతోసమాయనా మరిగి నిన్నిన్నిటాను మన్నించె నితఁడు | ॥ఇంత॥ |
| సాకిరి నేఁ బెట్టినట్టె సరివచ్చెనా నేఁడు మేకొని యీతఁడు నీక మేలువాఁడాయ యీకడ నీ కోరికలు యింతట నీడేరెనా చేకొని నీ చెప్పినట్టె సేసె నిదె యీతఁడు | ॥ఇంత॥ |
| నే నిచ్చిన నమ్మికలు నీకు నీడువచ్చెనా పూని శ్రీవేంకటేశఁ డిప్పుడు గూడెను తానకమై మీపొందులు తగులము లాయనా నానారీతుల నీతో ననిచినాఁ డీతఁడు | ॥ఇంత॥ |


