శృంగార సంకీర్తన
రేకు: 1925-6
సంపుటము: 29-90
రేకు: 1925-6
సంపుటము: 29-90
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| చూడఁ జిన్నదాన వింతె సుద్దులు కోటానఁగోటి యేడేడ నేరుచుకొంటివే వో కలికి | ॥పల్లవి॥ |
| కిన్నెరమీఁటులలోని గిలిగింతలు । నీ - వన్నెల కనుచూపుల వలవంతలు యెన్నరాని యిచ్చకపు టెలయింతలు యెన్నఁడు నేరుచుకొంటివే నో కలికి | ॥చూడఁ॥ |
| సారెకు నెడవాయని సరసములు । నీ - తారుకాణ సన్నల తమకములు గారవించి బుజ్జగించే గమకములు యేరీతి నేరుచుకొంటివే వో కలికి | ॥చూడఁ॥ |
| కందువ శ్రీవేంకటేశు కలయికలు । నీ - యందమైన సమరతి యలయికలు పొందుల మునిముంగిలి పొలయికలు యెందెందు నేరుచుకొంటివే వో కలికి | ॥చూడఁ॥ |


