శృంగార సంకీర్తన
రేకు: 1926-4
సంపుటము: 29-94
రేకు: 1926-4
సంపుటము: 29-94
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నారాయణి
| ఎందాఁకా సింగారించే వింటిలోనను అంది నిన్నుఁ బెండ్లాడే యాసతో నున్నాఁడు | ॥పల్లవి॥ |
| పలుకవే జవరాల పతితోడను నెలకొని నీ యెదుట నిలుచున్నాఁడు చిలుకవే నగవులు సెలవులను । నీ - కలయికలకు నిదె కాచుకున్నాఁడు | ॥ఎందాఁ॥ |
| వొసఁగవే విడె మిట్టె వుబ్బురేఁగను కొసరుచు నినుఁ గనుఁగొంటా నున్నాఁడు పొసఁగవే యాతని పొందులను వసమై నీ కాఁగిటికి వలచివున్నాడు | ॥ఎందాఁ॥ |
| వోరయనే చన్నుల నీ వుదుటు చూపి గరిమ నిన్నేలె శ్రీవేంకటేశ్వరుఁడు దొరయవే రతులను తోడఁదోడను సొరిది నీ చేఁతులకుఁ జొక్కివున్నాఁడు | ॥ఎందాఁ॥ |


