Display:
శృంగార సంకీర్తన
రేకు: 1926-6
సంపుటము: 29-96
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాదరామక్రియ
తనకేమే సారె సారెఁ దడవీ నన్ను
పనిలేదా పాటలేదా పంతగారివాఁడు
॥పల్లవి॥
మోవరాని చన్నులు మోఁచుక నే నుండఁగాను
వావు లేమి చెప్పీనే వద్దకు వచ్చి
చేవదేరి మోవిపండు చిప్పిలి తేనెగారఁగా
పూవులనేల వేసీనే పొద్దువోనివాఁడు
॥తన॥
మొగము అద్దముతోడ ముచ్చటాడఁగాను
నగనేల వచ్చీనే నాతోఁ దాను
వెగటైన నాతురుము వీఁపువెంట జారఁగాను
మగిడి యేమి చూచీనే మాయదారివాఁడు
॥తన॥
చక్కఁదనమెల్లా నామై చలపట్టుకుండఁగాను
యిక్కడ శ్రీవేంకటేశుఁ డేల ముట్టీనే
వుక్కుమీరి జవ్వనము వొడిగట్టుకండఁగాను
కక్కసించి కూడె నేమే కతకారివాఁడు
॥తన॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము