శృంగార సంకీర్తన
రేకు: 1927-1
సంపుటము: 29-97
రేకు: 1927-1
సంపుటము: 29-97
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవిగౌళ
| రమ్మనవే యిఁకనేల రవ్వసేయక పమ్ముకొన్న తమకము పారిపోవనిచ్చునా | ॥పల్లవి॥ |
| తనియని నా మనసు తనుఁ గోరకుండునా చెనకి నా ప్రియములు చేకొనుఁగాక మునుకొన్న చూపులు మోము చూడకుండునా యెనసి నా చేఁతలకు నియ్యకొనుఁగాక | ॥రమ్మ॥ |
| కోమలపు నా వయసు కొంగు వట్టించకుండునా దీమసానఁ గూడ సమ్మతించుఁగాక దోమటి నా వలపులు తొలఁగఁగ నిచ్చునా నా మాటలు దోయక నన్ను నేలుఁగాక | ॥రమ్మ॥ |
| కందువ నావలపులు కలయఁబెట్టకుండునా ఇందరిలో నాకుఁ జనవిచ్చుఁగాక పొందులు శ్రీవేంకటేశుఁ బొనుఁగఁగ నిచ్చునా చెందె నన్ను నిఁక నిట్టె చెలఁగించుఁగాక | ॥రమ్మ॥ |


