శృంగార సంకీర్తన
రేకు: 1927-2
సంపుటము: 29-98
రేకు: 1927-2
సంపుటము: 29-98
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| నీ సుద్దు లేమిచెప్పేవు నే నెరఁగనా ఆసవెట్టి నన్ను నింత ఆదరించేవుగాక | ॥పల్లవి॥ |
| తారుకాణంచితే యిట్టె దంటవై యేమి చూచేవు కోరి యాపె విడె మందుకొనవా నీవ సారె సారె నందుకుఁగా చలమేల సాదించవు చేరి యాపెఁ గొనగోరఁ జెనకవా నీవు | ॥నీసు॥ |
| మచ్చెము నీమై యుండఁగా మరియేలజంకించేవు నచ్చుకొట్టి యాపెతోడ నవ్వవా నీవు నిచ్చెలుల నడిగించి నిజమెంత నెరపేవు పచ్చిదేర నాపె పక్కఁ బండుండవా నీవు | ॥నీసు॥ |
| తోడ దిష్టము చూపితే దొమ్మిఁ గాఁగిలించేవు జోడై యాపె మోవి చవిచూడవా నీవు యీడనే శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు వాడిక నాపెకుఁ దొల్లి వలవవా నీవు | ॥నీసు॥ |


