శృంగార సంకీర్తన
రేకు: 1928-2
సంపుటము: 29-104
రేకు: 1928-2
సంపుటము: 29-104
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| ఈకె గలుఁగఁగ గదా యిన్నియును వెలవెట్టి దాకొని వొండొకటితో దారుకాణ లాయనే | ॥పల్లవి॥ |
| పొలఁతి మోమునఁ బోలు పున్నమచందురుఁడు కలికి కన్నులఁ బోలు కలువ లివి నిలువుఁ దురుముఁబోలు నెమ్మదిఁదుమ్మిదగుంపు యెలిమె మదనుసిరు లెంతనోము నోఁచెనే | ॥ఈకె॥ |
| వనిత బొమ్మలఁ బోలు వరుసఁ జెరకుటిల్లు చనుగుబ్బలనుఁ బోలు చక్రవాకాలు తనువునఁ బోలును తాలిమితోఁ జిగురాకు యెనలేని మరుసిరు లెంత నోము నోఁచెనే | ॥ఈకె॥ |
| యింతి పిరుఁదులఁబోలు యీతని బండి కండ్లు చెంతఁ బాదాలఁబోలు చెందామరలు సంతోసాన శ్రీవేంకటేశ్వురుఁడు గాఁగిటఁ గూడె యింతటాఁ గంతుని సిరు లెంతనోము నోఁచెనే | ॥ఈకె॥ |


