Display:
శృంగార సంకీర్తన
రేకు: 1928-5
సంపుటము: 29-107
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గౌళ
ఆయలేవే నీ పగటులన్నీఁ గంటిని
యీయెడ మెంతైనా నాతో నీడు వచ్చేవా
॥పల్లవి॥
పుక్కిటి తములముతో పొంచి పొంచి విభునికి
యెక్కడలేని కతలు నేమి చెప్పేనే
చెక్కు చెమ టాతనిపైఁ జిందఁగానే యంటిముట్టి
గక్కన నెంతేసి వూడిగములు సేసేవే
॥ఆయ॥
కొప్పు పువ్వులు పతిపై కులికి రాలుచుకొంటా
యిప్పు డెంత చెనకులా నెలయించేవే
రెప్పల చూపులఁ జెలరేఁగి కోమలపు మోము
కప్పుకొని యెందాఁకా నేఁకరి చూచేవే
॥ఆయ॥
గట్టి చన్నులు శ్రీవేంకటేశ్వరు దాఁకఁగాను
యిట్టునట్టు జవ్వాది యేమి పూసేవే
నెట్టవ నన్నితఁడేలె నే నలమేలుమంగను
చుట్టరికముల నీవు సుద్దు లేమి చెప్పేనే
॥ఆయ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము