శృంగార సంకీర్తన
రేకు: 1930-1
సంపుటము: 29-115
రేకు: 1930-1
సంపుటము: 29-115
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| అప్పటనుండి వెరగయ్యీ మిమ్మిద్దరిఁ జూచి వొప్పుగా సంతోసాల నోలలాడేమయ్యా | ॥పల్లవి॥ |
| పెక్కుసింగారాలతోడి పెండ్లికూఁతురు నీకు యెక్కడఁ గలిగె నానతియ్యవయ్యా మిక్కుటపు చేఁతల మేనమరఁదలు నేఁడు నెక్కొని సరసమాడ నీ భాగ్యమాయనయ్యా | ॥అప్ప॥ |
| రచ్చకెక్కినటువంటి రాణివాసము నీకు మెచ్చుగా నెందుండివచ్చె మేలు మేలయ్యా విచ్చనవిడియైనట్టి వేడుక నగళ్ళవారు అచ్చమై నీసేవసేయ నందమౌనయ్యా | ॥అప్ప॥ |
| కాఁపురము నేరిచిన కలికిగేస్తురాలు దాఁపురమై కాచుకుండెఁ దగవౌనయ్యా యేపున నన్నేలితివి యిట్టె శ్రీవేంకటేశ ఆపే నొకతె గలిగె నమరు నీకయ్యా | ॥అప్ప॥ |


