శృంగార సంకీర్తన
రేకు: 1930-4
సంపుటము: 29-118
రేకు: 1930-4
సంపుటము: 29-118
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గౌళ
| ఈకె తొల్లి నీకు మొక మెరిఁగినది గాఁబోలు వాకిటికి వచ్చె నీవు వలపించుకోవయ్యా | ॥పల్లవి॥ |
| సళుపుఁ జూపులు నీపైఁ జల్లుకొంటా మదిరాక్షి నిలుచున్న దిదిగొ నీ యెదుట పిలువని పేరఁటము పెండ్లిబండి యెక్కవచ్చె తిలకించి చూడవయ్యా దిష్టించి నీవు | ॥ప్లలవి॥ |
| చీటికిమాటికి నీతో చిరునవ్వు నవ్వుకొంటా మాటలాడీ నిదిగో మందె మేళాన పోటి గరితె తనాన బువ్వము గలయవచ్చె చోటిచ్చి తొడపైఁ బెట్టి సుద్దు లడుగవయ్యా | ॥ఈకె॥ |
| సారెకు శ్రీవేంకటేశ చన్నుల నొరసుకొంటా గోర నూఁదీ నిదిగో కూడితివంటా పోరచి చుట్టమై నీచేఁ బోఁక వెట్టించుకోవచ్చె బార చాఁచి కాఁగిలించి పక్కఁబెట్టుకోవయ్యా | ॥ఈకె॥ |


