శృంగార సంకీర్తన
రేకు: 1930-5
సంపుటము: 29-119
రేకు: 1930-5
సంపుటము: 29-119
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
| గుట్టు గొంత వలదా కోమలులకు ముట్టుమీరి వలపులు రట్టుసేయ నేఁటికి | ॥పల్లవి॥ |
| చక్కఁబెట్టుకోవే కొప్పు జాణతనా లేమాడేవు ఇక్కడఁబతి ముందర నేఁకారుకొంటా పక్కనఁ జన్నుల మీఁది పయ్యద గప్పుకోఁగదే నెక్కొన నిందరిలోన నివ్వెరగు లేఁటికి | ॥గుట్టు॥ |
| తుడుచుకోవే చెమట తొంగి యేమి చూచేవు వుడివోని తమి నువ్విళ్ళూరుకొంటా వెడవెడగాఁ బోఁకముడి వీడెఁ గట్టుకోవే అడియాసలనే పరాకయ్యే వదేఁటికి | ॥గుట్టు॥ |
| సరులు దిద్దుకోవే సన్నల నేమి మొక్కేవు పెరరేఁచి తమకము పేరించుకొంటా యిరవై శ్రీవేంకటేశుఁ డీతఁడే నన్నుఁ గూడె తరి నీవూఁ బెండ్లాడవే తలపోఁత లేఁటివి | ॥గుట్టు॥ |


