శృంగార సంకీర్తన
రేకు: 1931-4
సంపుటము: 29-124
రేకు: 1931-4
సంపుటము: 29-124
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| ఇదివో నాతలపోఁత లిన్నియు విన్నవించితి యెదుట గాచుకుందాన యెరవు లేదిఁకను | ॥పల్లవి॥ |
| సేవలు సేసితే నీవు చేకొని మన్నింతునని వావులు చెప్పితేను వలతునని భావించి చూచితేను బత్తి నపైఁ జేతువని నీవద్ద గాచుకుందాన నీ చిత్త మిఁకను | ॥ఇది॥ |
| సంతతముఁ గొలిచితే చనవెల్లా నిత్తువని చెంత మొక్కితేఁ గోరిక చెల్లింతువని మంతనము లాడితేను మచ్చికసేతువని యింతటఁ గాచుకుందాన నీడేరించు మిఁకను | ॥ఇది॥ |
| సెలవుల నవ్వితేను చేతికి లోనౌదువని సొలసితే నన్ను దయఁజూతువని అలమి శ్రీవేంకటేశ అలమేల్మంగను నేను యెలమి గాచుకుందాన యేలము నన్నిఁకను | ॥ఇది॥ |


