శృంగార సంకీర్తన
రేకు: 1931-6
సంపుటము: 29-126
రేకు: 1931-6
సంపుటము: 29-126
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగం
| విన్నవిఁ గన్నవిఁ గావు నీ పగట్లు పున్నమ వెన్నెల పొళ్ళు పొలఁతి నీ సుద్దులు | ॥పల్లవి॥ |
| సారె నేమి బులిసేవే సరసుని యెదుటను కేరి కేరి నవ్వేవేమే కెలసుకొంటా వూరకే పెనఁగేవేమే వొడివట్టి తీసుకొంటా ఆరజపు చేఁత లివి అట్టె నీకేతగునే | ॥విన్న॥ |
| సన్నలేమి సేసేవే సరి నెదురుగానుండి చన్నులేమి చూపేవే జంకించుకొంటా విన్నపాలేమి సేసేవే వేసాలు సేసుకొంటా వన్నెవెట్టుమేకు లివి వడి నీకే తగునే | ॥విన్న॥ |
| చేతులేమి చాఁచేవే శ్రీవేంకటేశ్వరు మీఁద కాతరించేవేమే యాఁకారుకొంటా యీతఁడే నన్నేలినాఁడు యిందరిలో మన్నించి యేతరితనాలే పెంచే విది నీకే తగునే | ॥విన్న॥ |


