శృంగార సంకీర్తన
రేకు: 1932-4
సంపుటము: 29-130
రేకు: 1932-4
సంపుటము: 29-130
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| ఇంకా వినిపించవే యీ కతలు వేడుకయ్యీ పొంకముగా జెలియా పొద్దువోదు నాకును | ॥పల్లవి॥ |
| సొలసి తనతో నేను సుద్దులు చెప్పినవెల్లా తలఁచుక చెప్పెనా తరుణి నీతో వలుద గుబ్బలఁ జంద్రవంకలు దా నొత్తినవి తెలిపెనా దాఁచక తేటతెల్లమిగను | ॥ఇంకా॥ |
| తంతోడ నేకతాన తననాసంది పొందులు మఱవక యడిగెనా మంచితనాన మఱి నన్నుఁ గరుణించి మన్నించినీమన్ననల- గుఱుతు లెఱిఁగించెనా కొంకక నీ కపుడు | ॥ఇంకా॥ |
| వేడుకతో నేనూఁ దానూ వినోదించిన రతులు ఆడ నీతోఁ దడవెనా యక్కరతోను యీడక వచ్చి శ్రీవేంకటేశుఁడు దా నన్ను నేలె జాడలు నీతో నించెనా సరికి బేసికిని | ॥ఇంకా॥ |


