శృంగార సంకీర్తన
రేకు: 1932-5
సంపుటము: 29-131
రేకు: 1932-5
సంపుటము: 29-131
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| ఇంతటిదానవౌత యిప్పుడే యెరిఁగితిమి వింత నీ నేరుపు లెందు వేరే నేర్చుకొంటివే | ॥పల్లవి॥ |
| చాయలుగా మాఁటలాడి సన్నల నోరూరించి పాయపు మగని నెంత పనిగొంటివే కాయజకేలిని మతి గరఁగించి యతనిచే సేయరాని బాస లెల్లాఁ జేయించుకొంటివే | ॥ఇంత॥ |
| కంచపుమోవి చూపి కన్నులనే తేలించి మించి చెలువుని నెంత మెప్పించితివే వంచనతో మొక్కు మొక్కి వలపులు వెడరేఁచి మంచితనాననే యెంత మన్నింపించుకొంటివే | ॥ఇంత॥ |
| వేవేలు చేఁతలు సేసి వేడుకలు వుట్టించి శ్రీవేంకటేశ్వరు నెట్లు చేకొంటివే యీవేళ నన్ను నేలె యీతఁడే యింటికి వచ్చి వావు లాతనికిఁ జెప్పి వలపించుకొంటివే | ॥ఇంత॥ |


