శృంగార సంకీర్తన
రేకు: 1933-2
సంపుటము: 29-134
రేకు: 1933-2
సంపుటము: 29-134
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| ఏమయ్యా తమకించే వెంత యాసోదకాఁడవు కామించి చే మొక్కితేను కాఁగిలించేవు | ॥పల్లవి॥ |
| నిమ్మపండ్లు కానుకఁగా నీకు నియ్యవచ్చితేను అమ్మరో చన్నులేల అంటేవయ్యా కమ్మరఁ బగడ మిట్టె కప్పముగాఁ బట్టితేను వుమ్మడి మోవికేల నోరూరేవయ్యా | ॥ఏమ॥ |
| చొక్కపు పసిఁడిబొమ్మ సూడిదెగాఁ జూపితేను పిక్కటిల్ల నాతో నేమి పెనఁగేవయ్యా పక్కన నుడుగరగాఁ బచ్చడము గప్పఁగాను అక్కరతో బయ్యదకొం గదేల పట్టేవయ్యా | ॥ఏమ॥ |
| వుంకువ నుంగరము నీ కుచితము దెచ్చితేను కంకణము నాకేలఁ గట్టేవయ్యా అంకెల శ్రీవేంకటేశ యన్నిటా నన్నేలితివి పొంకపురతుల కెంత పొంది మన్నించేవయ్యా | ॥ఏమ॥ |


