శృంగార సంకీర్తన
రేకు: 1933-4
సంపుటము: 29-136
రేకు: 1933-4
సంపుటము: 29-136
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| చాటి చెప్పితి మిపుడే సంతమౌటే మేలు వాటముగఁ జెలిమి మఱవకుమయ్యా యిఁకను | ॥పల్లవి॥ |
| సుదతి కనుచూపులకు సొరిది నొడ్డుకోరాదు అదరు వెన్నెలనవ్వు కడ్డము లేదు తుద బొమ్మజంకెనలు తొలఁగ దొబ్బఁగరాదు ముదురు వలపులు మిగుల ముంచుకొనునపుడు | ॥చాటి॥ |
| కొనగోరివాఁడి మరి గురిదప్పుకొనరాదు చెనకుఁ జేఁతుల కోరసేయరాదు మనసు కరఁగింపులకు మరఁగువెట్టఁగరాదు తనివోని కోరికలు తగులుకొనునపుడు | ॥చాటి॥ |
| వలుద చనుగుబ్బలకు వడి మాటుకొనరాదు కలయుకాఁగిటికి తెరఁగట్టరాదు యెలమి శ్రీవేంకటేశ ఇపు డీకెఁ గూడితివి కలుగుఁ దమకము లిట్లఁ గరుణించినపుడు | ॥చాటి॥ |


