శృంగార సంకీర్తన
రేకు: 1934-1
సంపుటము: 29-139
రేకు: 1934-1
సంపుటము: 29-139
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
| నెలఁత సింగారము నీ భాగ్యమాయ తలఁపు లీడేరె మీకుఁ దగుఁ దగునయ్యా | ॥పల్లవి॥ |
| భామ చనుఁగవ నదె బంగారువానగురిసీ తేమలెక్కి మోవివెంటఁ దేనెగారీని మోమునఁ జంద్రకళలు ముంచి కారుకమ్మీని నీ మోమము తెప్పలపై నించి తేలించవయా | ॥నెలఁ॥ |
| మొనసి సెలవులను ముత్యాలపంటలు నిండె తనువున వలపులు దైలువారీని వొనరిన యారుపొంత నున్నవి వళితరంగాలు యెనసె నీ వేడుకలు యీఁదులాడించవయా | ॥నెలఁ॥ |
| ముంచినచక్కఁదనాన మోహన రసములుబ్బీ నించెను కాఁగిటను పన్నీరుబుగ్గలు యెంచఁగ శ్రీవేంకటేశ యీకె నిట్టె యేలితివి అంచల నీరతు లోలలాడించవయా | ॥నెలఁ॥ |


