శృంగార సంకీర్తన
రేకు: 1934-2
సంపుటము: 29-140
రేకు: 1934-2
సంపుటము: 29-140
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| చిన్నదాననంటా నీవు సిగ్గువడేవే చన్నులను (నొ?)రసి మోవి చవిచూపఁగదవే | ॥పల్లవి॥ |
| చేరి చూడఁగఁజూడఁగా చీఁకటి వెలుగందురు పేరఁబెట్టితే పాలే పెరుగందురు కోరి కాచుకుండితే చిగురులే చేగలందురు వోరుపుతో నాతని వూడిగాలే సేయవే | ॥చిన్న॥ |
| మరుఁగగా మరుఁగగా మచ్చికవుట్టు నందురు పెరిగితే పూఁపలే పిందె లందురు నెరులు గూడఁగాగూడఁగా నిండుఁగొప్పాయనందురు సరసము లాతనితో సారె సారె నాడవే | ॥చిన్న॥ |
| మఱి చెప్పఁగాఁజెప్పఁగా మాఁటలే కత లందురు తఱుచు పొదుసేసితే తగు లందురు చిఱునవ్వులతో నిన్ను శ్రీవేంకటేశుఁడు గూడె మెఱసి పెక్కురతుల మెప్పించవే | ॥చిన్న॥ |


