శృంగార సంకీర్తన
రేకు: 1934-5
సంపుటము: 29-143
రేకు: 1934-5
సంపుటము: 29-143
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: హిందోళం
| ఇటువలె నుండవద్దా యిరవైన మోహము తటుకన నీమీఁది తగులెంతోకాని | ॥పల్లవి॥ |
| సొరిది నీమోము సారెఁ జూచియునుఁ దనియదు తరుణి మాఁటలాడియుఁ దనియదు సరసము లాడియాడి చాలునని తనియదు అరుదైన మదిలోని యాస యంతోకాని | ॥ఇటు॥ |
| ననుపుసేసుక చెలి నవ్వియునుఁ దనియదు తనువుసోఃకఁ బెనఁగి తనియదు మునుకొని చేతులెత్తి మొక్కియునుఁ దనియదు యెనసి నీపై వలపింకా నెంతోకాని | ॥ఇటు॥ |
| రమణఇ నీకాఁగిట రతిసేసి తనియదు తమితో గుబ్బలనొత్తి తనియదు జమళి శ్రీవేంకటేశ సన్నసేసి తనియదు అమరిన సంతోసమది యెంతోకాని | ॥ఇటు॥ |


