శృంగార సంకీర్తన
రేకు: 1935-4
సంపుటము: 29-148
రేకు: 1935-4
సంపుటము: 29-148
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| అలమేల్మంగనే నేను ఆకె నెటువంట(టి?)దో యెలుఁగెత్తి చెప్పవయ్యా యియ్యకొనే నేను | ॥పల్లవి॥ |
| మంతనము లాడెనట మగువ యెవ్వతొ నీతో చెంతనుండి సన్నలూనుఁ జేసెనట యింతులెల్లాఁ జెప్పుకొనే రీ సుద్దలే వాడలోన యెంతటిదో చూపవయ్య యెరిఁగేను నేను | ॥అల॥ |
| చెట్టవట్టి తీసెనంట చెలి నీ చెక్కులు నొక్కి గుట్టుతోడ నిన్ను వేఁడుకొనియనట బట్టబయలాయను యీ పనులెల్లా నూరిలోను అట్టిదానిఁ జూపవయ్య అడిగేను నేను | ॥అల॥ |
| గంటిసేసెనట మోవి కాఁగిలించుకొని నిన్ను వొంటిదే నీ పాదాలు నొత్తెనట నంటున శ్రీవేంకటేశ నన్ను నిట్టె యేలితివి దంటదానిఁ జూపవయ్య తగమెచ్చే నేను | ॥అల॥ |


