శృంగార సంకీర్తన
రేకు: 1936-1
సంపుటము: 29-151
రేకు: 1936-1
సంపుటము: 29-151
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| ఎన్నెని చెప్పేమయా నీ యింతి సుద్దులు చెన్నగు నీ గుణాలెల్లఁ జెప్పుకొంటానున్నది | ॥పల్లవి॥ |
| యెచ్చిన కోరికతోడ యెప్పుడు వత్తువోయంటా కచ్చుపెట్టుకొని యాపె గాచుకున్నది తచ్చి తచ్చి నీ పొందులే తలపోసుకొంటాను ముచ్చటతో దేవరకే మొక్కుకొంటా నున్నది | ॥ఎన్నె॥ |
| మాఁగిన మోవి చూపి నీమతి గరఁగించేనంటా కాఁగిటికి కంకణము గట్టుకున్నది తోఁగుఁజెమటతో నిన్నుఁ దోడితెమ్మని చన్నుల - వేఁగుతో నీ నెచ్చెలుల వేఁడుకొంటామన్నది | ॥ఎన్నె॥ |
| తేఁకువతో నిన్ను రతిఁ దెప్పలఁదేలించుదాఁకా యేఁకటతో వయసు మీదెత్తుకున్నది వీఁకతో నీ వేలఁగా శ్రీవేంకటేశ నీ గురుతు వాఁకముగా నీ రూపే వాసుకొంటానున్నది | ॥ఎన్నె॥ |


