శృంగార సంకీర్తన
రేకు: 1936-5
సంపుటము: 29-155
రేకు: 1936-5
సంపుటము: 29-155
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| ఎన్నఁడు నేరిచెనో యింతేసి దంటతనాలు కన్నుల పండువుగాను కంటి మీకె చేఁతలు | ॥పల్లవి॥ |
| సేసవెట్టి పెండ్లాడిన చెలి నీవద్ద నుండఁగా ఆస లేమి చూపీనే ఆకె నీకును వాసివంతులెంచుకోదు వల పారడిఁబెట్టుక వేసాలెల్లాఁ జేయఁగాను వెరగాయ నాకు | ॥ఎన్నఁ॥ |
| కాఁపురము సేసీ ఇంతి కదిసి సేవసేయఁగా ఆడలేక మాటలాడీ నప్పటిఁ దాను యీపె తగ వెఱఁగక యెమ్మెలఁ బొరలుకొంటా పూఁపనవ్వులు నవ్వీని పొద్దువోదోకాని | ॥ఎన్నఁ॥ |
| పట్టపు టలమేల్మంగ పాదాలు నీ కొత్తఁగాను యెట్టు నీతోఁ బొందుసేసీ నెంత చుట్టమో యిట్టె శ్రీవేకంటేశ ఇందరి నీ వేలితివి చుట్టి నిన్నుఁ గాఁగిలించీ చూడు మెంతసోద్యము | ॥ఎన్న॥ |


