శృంగార సంకీర్తన
రేకు: 1936-6
సంపుటము: 29-156
రేకు: 1936-6
సంపుటము: 29-156
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| నీకును నాపెకుఁ దగు నేము విన్నవించేదేమీ జోకతోడ నీకె మోము చూచి నవ్వవయ్యా | ॥పల్లవి॥ |
| మనసు లెనసినట్టి మాఁట లెవ్వరికైనాను విన వేడుకేకాని వెగటుగాదు వనిత నిన్నేమనినా వక్కణ లడుగవద్దు చనవిచ్చి మెచ్చి మెచ్చి సంతోసించవయ్యా | ॥నీకు॥ |
| చెల్లుబడియైనట్టి మాఁట లెవ్వరికైనాను యెల్లవారి కింపేకాని యెరపు కాదు వొల్లనే గోరనొత్తితే నొడ్డుకో నంతేసి చెల్లుబడి సేసుకొని చెక్కునొక్కవయ్యా | ॥నీకు॥ |
| పొందుగలిగినచోట పూఁచి యెంత పెనఁగినా అందమయ్యే తోఁచుఁగాని అలపుగాదు చెందె నలమేల్మంగ శ్రీవేంకటేశ నిన్ను కందువగా మోని యిచ్చి కడు మన్నించవయ్యా | ॥నీకు॥ |


