శృంగార సంకీర్తన
రేకు: 1937-2
సంపుటము: 29-158
రేకు: 1937-2
సంపుటము: 29-158
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| ఎంత గద్దో నీ యాసోద మింకాఁ జూతము కాని చెంత నాతఁ డెప్పుడూ నాచేతిలోనివాఁడు | ॥పల్లవి॥ |
| చనవునఁ బతితోను సరసము లాడేవు మనవులు చెప్పేవు మాపురాఁకాను పనివూని ఇంతటికిఁ బరవంజుకొంటివి తనివోని వలపులు తవ్వి పోసుకోవే | ॥ఎంత॥ |
| సారె సారె నవ్వుకొంటా సంగడిఁ గూచుండేవు పారుపత్యాలు సేసేవు పతిమారుగా వూరఁగల దొరతనా లొడిలఁగట్టుకొంటివి పారితెంచి పగటులు బండిఁబెట్టుకోవే | ॥ఎంత॥ |
| వుక్కుమీరి సేయరాని వూడిగాలు సేసేవు కక్కసించి గుబ్బలను కడు నూఁదేవు యిక్కడ శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నన్ను నేలె తక్కక నీ కోరికలు తలకెత్తుకోవే | ॥ఎంత॥ |


