Display:
శృంగార సంకీర్తన
రేకు: 1938-3
సంపుటము: 29-165
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కేదారగౌళ
ఎటువంటి వేడుకలో యివి మీకే తెలుసును
చిటిపొటి మీ సుద్దులు చెప్పుకొనే మిపుడు
॥పల్లవి॥
తరుణితో నేమంటివో తలఁచుక తలఁచుక
శిరసు వంచుక నవ్వు సెలవులను
నిరతపుభోగముల నేరు పెటువంటిదో
గరిమతోడుత మోము కళదేరుచుండును
॥ఎటు॥
చేరి సరమాడుతా చేఁత లేమి సేసితివో
వూరకె సిగ్గులతోడ నుమ్మగిలును
గారవించి మనసెంత కరఁగఁజేసితివో
కూరిమితో సంతోసించుకొని చెలరేఁగును
॥ఎటు॥
యెనసి కాఁగిటిలోన నెంత మెప్పించితివో
గొనకొని విన్నప్పుడూఁ గొనియాడును
చనవిచ్చి యేలితివి చందాన శ్రీవేంకటేశ
తనిసి నీ మన్ననల దా నిట్లా నుండును
॥ఎటు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము