శృంగార సంకీర్తన
రేకు: 1938-5
సంపుటము: 29-167
రేకు: 1938-5
సంపుటము: 29-167
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
| అట్టె నిన్నుఁ జూచి చూచి అరుదందేరు చెలులు నెట్టన నీ యెమ్మెలెల్లా నెరపేవు నీవు | ॥పల్లవి॥ |
| మొక్కలపుఁ జేఁతలును మొసగస మాఁటలును యెక్కడ నేరిచితివే యింతేసి నీవు చెక్కునఁ బెట్టిన చేయి సెలవుల నవ్వులను గక్కన నప్పటి నెందు గడియించుకొంటివే | ॥అట్టె॥ |
| నిడువాలుఁ జూపులును నిక్కుబొమ్మ జంకెనలు గుడిగొన నెందు దెచ్చుకొంటివే నీవు వెడజారఁబయ్యెదయు వీడియు వీడని కొప్పు అడియాలా లన్నియును నమరెనే నీకు | ॥అట్టె॥ |
| వుప్పతిలు రాజసాలు వులివచ్చి సిగ్గులను యిప్పుడెందుఁ జదివితి వింతేసి నీవు అప్పుడు శ్రీవేంకటేశుఁ డలమేల్మంగను నేను నెప్పున నన్నేల మరి నీ వెన్నటిదానవే | ॥అట్టె॥ |


