శృంగార సంకీర్తన
రేకు: 1939-3
సంపుటము: 29-171
రేకు: 1939-3
సంపుటము: 29-171
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
| తారుకాణ వచ్చెనా తలఁచుకో నామాఁట గారాబు టలమేల్మంగ కాఁగిటిలోవాఁడవు | ॥పల్లవి॥ |
| అప్పుడే చెప్పితిఁగా నీ వాపె మోము చూచితేనే దెప్పరపు వలపుల దేలించునని ముప్పిరి నది యంతటి మొగమాయ మందులాఁడి విప్పుచు నీతో విన్నవించరాదుగాక | ॥తారు॥ |
| పందెము వేసితిఁగా యేపాటిమాఁట నీ వాడినా యిందుముఖి నిన్ను బయలీఁదించునని యిందరిలో తొల్లె యది యెంత యెలయింపులాఁడి చెంది యివి వెల్లవిరి సేయరాదుగాక | ॥తారు॥ |
| సాకిరి వెట్టితిఁగా యచ్చట నవ్వితేఁ దాను చేకొని శ్రీవేంకటేశ చెనకునని యీకడ నన్నేలితి విది యెంత చేఁతలాఁడి జోకతోడది నీగుట్టు చూపరాదుగాక | ॥తారు॥ |


