శృంగార సంకీర్తన
రేకు: 1940-4
సంపుటము: 29-178
రేకు: 1940-4
సంపుటము: 29-178
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| చెలియ నా విన్నపాలు చిత్తానఁ బెట్టుమనవే మలసి న న్నేకాలమూ మన్నించుమనవే | ॥పల్లవి॥ |
| యిచ్చక మాడుదుఁగాని యేమిటా వెంగెములాడ కొచ్చి కొసరుదుఁగాని కోపగించను పచ్చిగి నవ్వుదుఁగాని పంతములు నెరపను తచ్చి తచ్చి నా గుణాలు తా నెరుఁగుననవే | ॥చెలి॥ |
| వాడిక చూపుదుఁగాని వాసి వంతు లెంచను వేడుకలు వెంతుఁగాని వేసారను వూడిగాలు సేతుఁగాని వుదుటున జంకించను యీడు జోడైన నా బత్తి యెంచిచూడుమనవే | ॥చెలి॥ |
| చేరి కాఁగిలింతుఁగాని సిగ్గులు మరఁగుసేయ గారవింతుఁగాని మరి గయ్యాళించను యీరీతి శ్రీవేంకటేశుఁ డే నలమేలుమంగను తారుకాణగా నన్నేలె తలఁచుకొమ్మనవే | ॥చెలి॥ |


