శృంగార సంకీర్తన
రేకు: 1940-6
సంపుటము: 29-180
రేకు: 1940-6
సంపుటము: 29-180
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| తనంటిదాననా తరుణి నింతే నేను పనివూని నాతో నేల పంతములాడీనే | ॥పల్లవి॥ |
| చిగురువంటిది మోవి చెప్పి చూపె నంటిమా నగవు వెన్నెలలోని నామువంటిది మొగులువంటిది కొప్పు ముడుచుకున్నారము జిగిమించి మమ్ము నేల చెనకీనే తాను | ॥తనం॥ |
| తలపోయ మా మొగము తామరపూవువంటిది బలుచన్ను లివి నిమ్మపండ్లవంటివి తొలుతనే యివె మా చేతులు తీఁగెలవంటివి చలముల మాతో నేల సాములు సేసీనే | ॥తనం॥ |
| రయమున మా తొడ లరఁటి కంభాలవంటివి బయలువంటిదివో చెప్పఁగ నడుము నియతాన మన్నించి నేఁడు శ్రీవేంకటేశుఁడు దయతో నన్నేలె నేల తమకించీనే | ॥తనం॥ |


