శృంగార సంకీర్తన
రేకు: 1941-2
సంపుటము: 29-182
రేకు: 1941-2
సంపుటము: 29-182
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శుద్ధవసంతం
| అక్కచెల్లెండ్లము నేము ఆకె నాకు వింతగాదు చక్కఁగా మాఁటలాడరే సంతోసించుకొంటాను | ॥పల్లవి॥ |
| చెప్పరే మీ రితనికి చెలియ సుద్దు లెల్లాను విప్పుచుఁ జెవులు చల్లఁగా వినీఁగాక యిప్పు డిట్టె నేనుండఁగా నేల దాఁచే రాపనులు చొప్పుగా మొక మొకాలు చూచుకొంటాను | ॥అక్క॥ |
| మొక్కరే మీ రితనికి మోహపు దేవుల మారు చొక్కుచుఁ గన్నులారాఁ జూచి యేల యిక్కడ నన్నుఁ జూచి వూరకున్నవాఁడు చెక్కుల చేతులతోడ చేరి నవ్వుకొంటాను | ॥అక్క॥ |
| యియ్యరే కానుక లాపె యిచ్చి పంపినవెల్లా చెయ్యారా నందుకొని చెలఁగుఁగాని యియ్యెడ శ్రీవేంకటేశుఁ డేలినాఁడు నన్ను నిట్టె వొయ్యనే మీరేల లోఁగే రూహించుకొంటాను | ॥అక్క॥ |


