శృంగార సంకీర్తన
రేకు: 1941-6
సంపుటము: 29-186
రేకు: 1941-6
సంపుటము: 29-186
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవిశ్రీ
| మెచ్చరే యీకె నిందుకు మెలుఁతలాల అచ్చమైన యాఁటదాని కన్నియు నమరునే | ॥పల్లవి॥ |
| కూరిమి గలది పతిఁ గొసరఁగఁదగునే వోరుపు గలది వొద్దనుండఁదగునే మేరతోడ మెలఁగేది మేలమాడఁదగునే వూరకె మీ రాపె నేల వుప్పతించేరే | ॥మెచ్చ॥ |
| ప్రియము గలిగినది పెనఁగఁగఁదగునే నయగారియైనది నవ్వఁదగునే క్రియ యెఱిఁగినది మొక్కి పొగడఁదగునే రయమున నాపె నేల రాఁపుసేసేరే | ॥మెచ్చ॥ |
| సేసవెట్టినాపెకు చెనకఁగఁదగునే ఆసగలదానికి నంటఁదగునే యీసరి శ్రీవేంకటేశుఁ డేలినాఁడు మమ్మిద్దరి వేసరకు యాపె నేల వెంగేలాడేవే | ॥మెచ్చ॥ |


