శృంగార సంకీర్తన
రేకు: 1942-1
సంపుటము: 29-187
రేకు: 1942-1
సంపుటము: 29-187
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| వింటిమే నీ చేఁతులు వీనుల పండువగాను కంటిమే మీ వొద్దికలు కన్నులు చల్లఁగాను | ॥పల్లవి॥ |
| నీటుకత్తెవు నౌదువు నేరుపరివి నౌదువు మాటలాడ వలఁతివే మగనితోను పాటించి యాతని నీవు పక్కవాయనీయవు మేటిసతులెల్లాను మెచ్చేరే నిన్నును | ॥వింటి॥ |
| దొరవూ నీ వౌదువే దొడ్డదాన వౌదువే బిరుదు గట్టుక వలపించాఁగలవే యెరవులేక యేపొద్దూ యింటఁ బెట్టుకుందానవు పొరుగిరుగులవారు పొగడేరు నిన్నును | ॥వింటి॥ |
| పంతగతైవు నౌదువే బలుదాన వౌదువే వింతలుగాఁ గూడి పొందు వెలయింతువే ఇంతలోనె శ్రీవేంకటేశుఁ డిట్టె నిన్నుఁగూడె ఇంతులెల్లా సంతోసాన నెంచేరు నిన్నును | ॥వింటి॥ |


