శృంగార సంకీర్తన
రేకు: 1943-1
సంపుటము: 29-193
రేకు: 1943-1
సంపుటము: 29-193
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| భూపతిచెరువుచెంతఁ బొంచుక రతులకును యే పొద్దు సతులకును యెదురు చూచీనే | ॥పల్లవి॥ |
| నవ్వులసెలవులతో నానిన చెమటలతో పువ్వుల దండలు వేరే బుజాలతోడ జవ్వన పాయముతోడ జారిన తురుముతోడ యెవ్వతెనో కూడివచ్చి యీడ నున్నాఁడే | ॥భూప॥ |
| అరవిరి బాగులతో నాయముల కరఁగులతో గరిమల నెమ్మొగము కళలతోడ సురత వాసనలతో చొక్కపు సింగారాలతో పురిగొన్న వేడుకతో భోగించీనే | ॥భూప॥ |
| పుక్కిటి విడేలతోడ పులక జొంపాలతోడ పిక్కటిలఁ దేనెలూరే పెదవితోడ యిక్కువ శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నన్ను నేలె వెక్కసపుఁ దమకాన వినోదించీనే | ॥భూప॥ |


