శృంగార సంకీర్తన
రేకు: 1944-3
సంపుటము: 29-201
రేకు: 1944-3
సంపుటము: 29-201
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| నిన్ను నన్ను నెంచుకొంటే నీవే నేను । నీవు మన్నించినదే గురుతు మరి యాడ సుద్దులు | ॥పల్లవి॥ |
| నీ తలనే వేగేనా నెలఁతలఁ బెండ్లాడేది కాతరించేవారికెల్లాఁ గలదే ఇది నాతో నేమి చేప్పేవు నన్నొడఁబరచనేల యీతల నీ చేఁతలెల్లా నియ్యకొంటి నేను | ॥నిన్ను॥ |
| యెవ్వరు నెఱఁగనివా యిలలో నీ వలపులు జవ్వనపువా రుండేటి జాడలే ఇవి తవ్వనేల యిసుకపాఁతరలు సారె సారెకు పువ్వులవంటి గుణాలు పొగడే నిపుడు | ॥నిన్ను॥ |
| మఱవఁగ వచ్చునా మనసులో తలపోఁత పెఱరేఁచి నిన్ను రట్టుపెట్టకుండునా యెఱుఁగుదు శ్రీవేంకటేశ నన్ను నేలితివి మెఱసి నీ పొందులకు మెచ్చితి నన్నిటాను | ॥నిన్ను॥ |


