శృంగార సంకీర్తన
రేకు: 1945-5
సంపుటము: 29-209
రేకు: 1945-5
సంపుటము: 29-209
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భల్లాటి
| ఆనతియ్యవయ్యా వినే నవీఁ గొన్నివేడుకలు వీనుల పండుగగాను వినోదము లెల్లాను | ॥పల్లవి॥ |
| తచ్చి నీ మోహపు కాంత తలఁపాయనో నీకు కచ్చు పెట్టి మోమునిండాఁ గళ రేఁగెను గచ్చుల నాపెఁ గాఁగిట గాఁగిలించినట్టాయనో మచ్చిక నీ మేనఁ జెమటలు గారీని | ॥ఆన॥ |
| కోమలి నీ మై నించిన గురుతు చాచుకొంటివో నామువార సెలవుల నవ్వు దేరీని ఆముక యాపె కెమ్మోవి యాస నీకు ముంచెనో కామించి మదరాగము కన్నులఁ జూపట్టెను | ॥ఆన॥ |
| పడతి నప్పుడే నీవు భావమునఁ గూడితివో కడుఁగడు మేనెల్లా గురుపారెను యెడయక శ్రీవేంకటేశ నన్ను నేలితివి వుడివోనివలపుల నోలలాడేవు | ॥ఆన॥ |


