శృంగార సంకీర్తన
రేకు: 1947-2
సంపుటము: 29-218
రేకు: 1947-2
సంపుటము: 29-218
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వసంతం
| మూసి మంతనములేల ముంచి వెల్లవిరిగాను సేసవెట్టి పెండ్లాడితే చేరి వద్దనేనూ | ॥పల్లవి॥ |
| తెరమరఁగున నుండి తేఁకువతో నాయకుని విరుల నెంత వేసేవే వేమారును అరిమురి నేఁడు నీకు నంత వలపుగలిగితే సరసఁ గూచుండి మోవి చవి చూపరాదా | ॥మూసి॥ |
| అవ్వలిమోము సేసుక యంతలోనే రమణుని నవ్వుచుఁ గివగోరేల నాఁటించేవే యెవ్వరూ నేమి చెప్పేరు యింత నీకు వేడుకైతే చివ్వన గాఁగిట నించి చిమ్మరేఁచరాదా | ॥మూసి॥ |
| చెక్కిటఁ జేయి వెట్టుక శ్రీవేంకటేశ్వరుని నిక్కి యేమి చూచేవే నివ్వెరగుతో నెక్కొని న న్నితఁడేలె నీకూఁ గొంత చుట్టమైతే మొక్కు మొక్కి వేఁడుకొని ముచ్చటాడరాదా | ॥మూసి॥ |


