శృంగార సంకీర్తన
రేకు: 1948-3
సంపుటము: 29-225
రేకు: 1948-3
సంపుటము: 29-225
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సింధురామక్రియ
| పిలువ వచ్చితి నేను ప్రియురాలి కడనుండి యెలమి నా మాటవిని యింటికి రావయ్యా | ॥పల్లవి॥ |
| పచ్చిదేరి వలపులు పడఁతికి నీకు నేఁడు కొచ్చి కొచ్చి తమకము గుబ్బతిలీని విచ్చన విడాయను వేడుకతో సరసాలు యెచ్చుగుందు రిఁక నేల యింటికి రావయ్యా | ॥పిలు॥ |
| నివ్వటిల్లె వయసులు నెలఁతకు నీకు నేఁడు వువ్విళ్ళూరీ మీలోని వొడఁబాటులు చివ్వనఁ బురిగొనెను చిగిరింత సిగ్గులు యెవ్వరూ నేమి చెప్పేరు యింటికి రావయ్యా | ॥పిలు॥ |
| అందుకొనె నాసలు అంగనకు నీకు నేఁడు కందువ రతులు తారుకాణాలాయను పొందుగా శ్రీవేంకటేశ భోగించితి వీకెను యిందరూ మెచ్చిరి నిన్ను యింటి కిట్టె రావయ్యా | ॥పిలు॥ |


