Display:
శృంగార సంకీర్తన
రేకు: 1948-4
సంపుటము: 29-226
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
కంద మీకె సరితలు కన్నులారాను
యెందుండి వచ్చెనో నీపై నింపులు చల్లీని
॥పల్లవి॥
తేనెలుగార మాఁటాడీ తీగె యెలుఁగులు సాగ
కానుకిచ్చి నీ మనసు గరఁగఁజేసె
నానఁబెట్టె వలపులు నయగారితనమున
యీ నేరుపులనే నీకెంత తమిరేఁచీనో
॥కంద॥
చల్లని చూపులఁ జూచీ సరుసఁ గూచుండుకొంటా
మెల్లనె నవ్వులు నవ్వి మెప్పించె నిన్ను
తెల్లమిగా సన్నసేసి తెలుపుకొనె వావులు
చెల్లుబడి నింకా నెంత సేవలు సేసీనో
॥కంద॥
కుంకుమ గుబ్బల నొత్తె కొలువులు సేసుకొంటా
పొంకపుఁ జేఁతలనే పొద్దులు వుచ్చె
అంకెల శ్రీవేంకటేశ అట్టె నన్ను నేలితివి
సంకెలేక తనబత్తి చవి యెంత చూపీనో
॥కంద॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము