శృంగార సంకీర్తన
రేకు: 1948-5
సంపుటము: 29-227
రేకు: 1948-5
సంపుటము: 29-227
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగం
| మేలు మేలు యీ కీర్తి మిక్కిలిఁ గట్టుకొంటివి నీ లాగులెల్లాఁ జూచి నీకు మొక్కే నేను | ॥పల్లవి॥ |
| యే లాటా లాపెతోడ నెటువలె నాడితివో మేలమాడ నేర్తువంటా మెచ్చీ నిన్ను లాలించి మనసేరితి లలిఁగరఁగించితివో పోలించి యందరిలోనాఁ బొగడీని నిన్ను | ॥మేలు॥ |
| యేకతాననుండి నీవు యెంత చనవిచ్చితివో తూకొని వేడుకతో సంతోసించి నిన్ను జోకగా నేమిట నీవు చొక్కఁగఁ జేసితివో యేకడా జాణఁడవంటా యెంచీని నిన్ను | ॥మేలు॥ |
| నెట్టుక రతుల నెట్టు నీవు గాఁగిలించితివో జుట్టవేలఁ బలుమారుఁ జూపీ నిన్ను గుట్టుతో శ్రీవేంకటేశ కూడితివి నన్ను నేఁడు అట్టె నా వావి చెప్పి తా నాదరించీ నిన్ను | ॥మేలు॥ |


