Display:
శృంగార సంకీర్తన
రేకు: 1948-6
సంపుటము: 29-228
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాదరామక్రియ
తానే ముందుగా వచ్చి తడవె నన్ను
ఆనుకొని వసంతములాడితి నే వెనక
॥పల్లవి॥
కొలువులో నుండఁగానే కుంకుమ నాపైఁ జల్లె
చిలుకఁజిమ్మనఁగోవిఁ జిమ్మితి నేను
కలువలఁ గొనివేసె కమ్మటిఁ దా నామీఁద
వెలిఁదమ్మిగుత్తిఁ గొని వేసితి నేను
॥తానే॥
తగిలి వెంట నే వచ్చి తనజడవట్టితేనే
మగిడి నా చన్నులు నెమ్మదిఁ బట్టెను
చిగిరుబంతిఁగొని వేసితి నప్పటి నేను
మొగము చూడఁగానే మోవి గంటి సేసెను
॥తానే॥
పాఁగిన తమకమున పన్నీరు నాపయి నించె
చేఁగదేరఁ జేయివట్టి చిమ్మితి గోర
యేఁగివచ్చి శ్రీవేంకటేశుఁడు నన్ను మన్నించి
కాఁగిలించి పట్టుకొని కళలు రేఁగించెను
॥తానే॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము