Display:
శృంగార సంకీర్తన
రేకు: 1949-3
సంపుటము: 29-231
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: తెలుఁగుఁగాంబోది
తన దేవులఁ గానా తన కెందురాడేనా
తనిపి రతుల నిట్టె దప్పి దేర్చుమనవే
॥పల్లవి॥
చందురుని వెన్నెలల జాలినేల తోసీనే
మందానిలు వేఁడికేల మైకొలిపీనే
అంది కోవిల కూఁతకు నడ్డమేల తోసీనే
యిందుకు విచ్చేసి నన్ను నీడేరుచు మనవే
॥తన॥
చిలుకలపలుకులఁ జిమ్మిరేపించినేలే
అలినాదములకేల యప్పగించీనే
పలుగోరువంకలబారినేల పెట్టీనే
తలకొని నన్ను నేలి దయఁజూడు మనవే
॥తన॥
మనసిజతాపమున మరలింపించు మనవే
చనవిచ్చి వసంతునిఁ జల్లజేయు మనవే
యెనసి శ్రీవేంకటేశుఁ డిదె తానె వచ్చి నన్ను
మనికై నావద్దనుండి మన్నించు మనవే
॥తన॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము