శృంగార సంకీర్తన
రేకు: 1950-1
సంపుటము: 29-235
రేకు: 1950-1
సంపుటము: 29-235
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేశాక్షి
| విందువు రావయ్యా వేడుక నీకుఁ గలిగితే అంది తలఁచుకోవయ్యా ఆపె నీలో పొందులు | ॥పల్లవి॥ |
| కొప్పు నిక్కఁ బెట్టుకొని గుబ్బలాఁడి యొక్కతె అప్పటనుండి వాకిట నడిగీ నిన్ను పిప్పిగట్ట విడేలు పెదవినిండాఁ జేసి చెప్పీనదె నీ తన చిన్ననాటి సుద్దులు | ॥విందు॥ |
| కన్నులారుచుకొంటాను కతకారి తానొకతె నిన్నుఁ జూడఁ దమకించీ నెయ్యముతోడ చిన్ని చెక్కులవెంటాను చిప్పిల జవ్వాది గార కిన్నెరలో వాయించీ మిక్కిలి నీపై చిందులు | ॥విందు॥ |
| వాడికమాఁటలులోడ వాకిలి దెరచుకొని యీడకు వచ్చినది నీయెదుటికిని కూడితివి నన్నుఁ దొల్లె గుట్టున శ్రీవేంకటేశ వీడె మిచ్చి మేచ్చీ నిన్ను వింత వింత లాగులా | ॥విందు॥ |


